Malla Reddy: నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్: మల్లారెడ్డి

Malla Reddy Claims He Is Trending Star
షార్ట్స్‌లో చూడండి

ఎక్కడున్నా తనదైన పంచ్ డైలాగులతో నవ్వులు పూయించే అలవాటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి... నేడు బడ్జెట్ సమావేశాల వేళ కూడా అదే జోష్‌ను కొనసాగించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.


"అసలు సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది నేనే.. ఇప్పుడు నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్‌ను" అంటూ మల్లారెడ్డి నవ్వులు పూయించారు. ఇక సినిమాల్లో నటించే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే సమాధానం ఇచ్చారు. "నాకు ఒకరు సినిమా అవకాశం ఇవ్వడం ఏంటి..? నేనే ఒక పెద్ద స్టార్‌ను" అని అన్నారు. ఒకవేళ సినిమా చేయాలనిపిస్తే ఎవరి కోసమో వేచి చూడనని, అవసరమైతే తన సినిమాను తానే సొంతంగా తీస్తానని చెప్పారు.

Go Back to Shorts
Malla Reddy
BRS MLA
Telangana Politics
Trending Star
Social Media
Budget Sessions
Viral Videos
Punch Dialogues
Telangana News

More Telugu News