Ananta Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు... ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు
ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితురాలిగా (A2) ఉన్న ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) భార్య లక్ష్మీదుర్గ నిన్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె విచారణలో పాల్గొన్నారు.
కాకినాడ ఎస్డీపీఓ కార్యాలయంలో జరిగిన తొలిరోజు విచారణ దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఇద్దరు మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీదుర్గ వాంగ్మూలాన్ని నమోదు చేయగా, మొత్తం విచారణ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డ్ చేశారు. సిట్ దర్యాప్తులో వెల్లడైన పలు అంశాలపై అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
గతంలో రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. మార్చి 16 నుంచి 30 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సిట్ విచారణకు సహకరించాలని ఆదేశించింది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, సాక్ష్యాల ధ్వంసంలో లక్ష్మీదుర్గ పాత్ర ఉందని సిట్ అనుబంధ ఛార్జిషీట్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఆమె ఈ నెల 30న రాజమహేంద్రవరం కోర్టులో కూడా హాజరుకావాల్సి ఉంటుంది.