Excise Constable: 36 ఏళ్ల నాటి రూ.500 లంచం కేసులో... కానిస్టేబుల్‌కు శిక్ష తగ్గింపు
36 సంవత్సరాల క్రితం రూ.500 లంచం తీసుకున్న కేసులో ఒక కానిస్టేబుల్‌కు ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, తాజాగా సుప్రీంకోర్టు ఆ శిక్షను ఏడాదికి తగ్గించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ 1990లో రూ.500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలో అతడిపై కేసు నమోదైంది. 2006లో సెషన్స్ కోర్టు అతడిని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ఆ కానిస్టేబుల్ ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. ట్రయల్ కోర్టు తీర్పును 2012లో హైకోర్టు సమర్థించింది. దీనితో అతను సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అతడి అప్పీలుపై జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పీబీ పరాలేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఎక్సైజ్ కానిస్టేబుల్ వయస్సును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు శిక్షను తగ్గించింది. ప్రస్తుతం 75 ఏళ్ల వయస్సు కలిగిన ఆ వ్యక్తి ఇప్పటికే రెండు నెలలు జైల్లో గడిపినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆయన శిక్షను ఏడాదికి తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది.