Nepal Oil Corporation: నేపాల్‌లో చుక్కలను అంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ సెగలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దహించివేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కాస్తా ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీయడంతో, మన పొరుగు దేశమైన నేపాల్‌లో పెట్రో ధరలు రాత్రికి రాత్రి రికార్డు స్థాయికి చేరాయి. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఈ రోజు నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.
భారీగా పెరిగిన ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా నేపాల్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా సవరించింది. పెట్రోల్ లీటరుకు రూ.31 పెరగడంతో ఇప్పుడు రూ.188 కి చేరింది. డీజిల్ ఏకంగా రూ.54 పెరగడంతో లీటరు ధర రూ.196 కి చేరుకుంది. ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.296 భారం పడటంతో, ఇప్పుడు ఒక్కో బండ ధర రూ.2,126 కు పెరిగింది.
యుద్ధమే అసలు కారణం..
ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు కొరత ఏర్పడింది. ఈ ప్రభావం నేరుగా దిగుమతులపై ఆధారపడే నేపాల్ వంటి దేశాలపై పడింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమకు నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేస్తున్న ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’కు నేపాల్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. భారత్ లో ప్రస్తుతానికి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ సరిహద్దు దాటితే మాత్రం పెట్రో మంటలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి.