Sreeleela: పవన్ డైలాగ్స్ చెప్పి అలరించిన శ్రీలీల, రాశీ ఖన్నా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్లు శ్రీలీల, రాశీ ఖన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాంకర్ సుమ వారితో చిట్ చాట్ చేస్తూ పవన్ కల్యాణ్ సినిమాలోని డైలాగ్స్ చెప్పమని కోరగా, శ్రీలీల, రాశీ ఖన్నా తమదైన శైలిలో పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు.
యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈవెంట్‌లో పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, యాంకర్ సుమ కనకాల పాల్గొన్నారు.
కాగా, 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ సినిమాకు బెనిఫిట్ షో ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది.