సినిమా అంటే నాకు ప్రాణం... అందుకే దాన్ని ఎప్పటికీ వదల్లేను: పవన్ కల్యాణ్
"నాకు తెలిసిన, నేను చూసిన హీరో ఒక్కరే.. అది అన్నయ్య చిరంజీవి గారే" అంటూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తన అన్నయ్యే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్ర గ్లింప్స్‌ను చూసి అభినందిస్తూ చిరంజీవి, రామ్ చరణ్ చేసిన ట్వీట్లకు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగిన చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్ ప్రసంగించారు.
"ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన, నా గుండెల్లో స్థానం ఉన్న మీ అందరికీ, టీవీలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు మీ ఆశీస్సులు అందించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇందాక సుమా గారు మాట్లాడుతూ నన్ను గతకాలం నాటి హీరో అన్నట్టు మాట్లాడారు. ఈ మధ్యనే 'ఓజీ' వచ్చిందనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. నేను రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను ఇలా వెనక్కి నెట్టడం భావ్యం కాదని బల్లగుద్ది మరీ చెబుతున్నాను. సరదాగా అంటున్నాను కానీ, సినిమా అంటే నాకు ప్రాణం. నాకు అన్నం పెట్టింది సినిమా. ఈ రోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపును ఇచ్చింది కూడా సినిమానే. అందుకే సినిమాను వదల్లేను. నా నిర్మాతలు, దర్శకులు, రచయితలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కలెక్షన్ల గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను తెలుగు సినిమా, తమిళ సినిమా అని చూడను, భారతీయ చిత్ర పరిశ్రమగానే భావిస్తాను.
నా హీరో అంటే ఒకే ఒక్కరు... మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి అన్నయ్య, ఈ రోజు 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ చూసి ట్వీట్ చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రామ్ చరణ్, 'పెద్ది' దర్శకులు బుచ్చిబాబు గారికి కూడా ధన్యవాదాలు.
ఒక సినిమాను మొదలుపెట్టేటప్పుడు అద్భుతంగా రావాలనే అందరం కోరుకుంటాం. కానీ ఆ తర్వాత ఎన్నో అడ్డంకులు, ఒడిదొడుకులు ఎదురవుతాయి. వాటన్నింటినీ దాటుకుని విజయం సాధించడం చాలా కష్టం. నేను ఒకసారి దర్శకుడిని నమ్మితే, గుడ్డిగా నమ్మేస్తాను. ఏం చేయమంటే అది చేస్తాను. హరీశ్ శంకర్ మొదట ఒక కథ చెప్పారు, కానీ అది ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత కథ మారింది, మధ్యలో కొవిడ్ వచ్చింది, నేను రాజకీయాల్లోకి వెళ్లాను. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, నా విధులకు ఇబ్బంది కలగకుండా పక్కా ప్రణాళికతో ఈ సినిమా చేశాం. రాత్రింబవళ్లు కూర్చుని కేవలం 40-45 రోజుల్లోనే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాను. నిజంగా పక్కా ప్లానింగ్ ఉంటే, రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలు చేయొచ్చని ఈ సినిమా నాకు భరోసా ఇచ్చింది. ఆ ఘనత దర్శకుడు హరీష్ శంకర్‌దే.
ఒక నిర్మాణ సంస్థకు వరుసగా విజయాలు రావడం కాకతాళీయం కాదు. మైత్రీ మూవీ మేకర్స్ వారు తీస్తున్న 'పుష్ప', 'జనతా గ్యారేజ్' వంటి చిత్రాల విజయాల వెనుక వారి కృషి ఎంతో ఉంది. అలాంటి సంస్థలో పనిచేసే అవకాశం వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మీలో ఒకడు దర్శకుడు అయితే ఎలా ఉంటుందో, అలా ఉండే హరీశ్ శంకర్. తెలంగాణ నేల నుంచి వచ్చిన ఈ దర్శకుడికి హద్దుల్లేవు. 'గబ్బర్ సింగ్' సమయంలో నాకు హార్స్ రైడింగ్ రాకపోయినా, గుజరాత్‌లో గుర్రం మీద నన్ను నడిపించాడు. ఒక నటుడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడానికి తను పడే తపన అలాంటిది. అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్లొద్దని నేను చెబుతుంటాను. ఎందుకంటే తను ఇచ్చిపడేసే గోత్రం అయితే, నేను దెబ్బలు తీసుకునే రకం. అలాంటి వ్యక్తి మన తెలంగాణ గడ్డకు, దేశానికి భవిష్యత్తులో ఎంతగానో సేవ చేస్తాడన్న నమ్మకం నాకుంది.
ఈ సినిమాలో నటించిన శ్రీలీల గారు అద్భుతంగా నటించారు. తన పాత్ర ఇప్పటివరకు తను చేసిన అన్ని పాత్రల్లో గుర్తుండిపోతుంది. కేవలం నా మీద నమ్మకంతో కథ కూడా వినకుండా నటించడానికి వచ్చిన రాశీ ఖన్నా గారికి, అలాగే సీనియర్ నటులు కేఎస్ రవికుమార్ గారికి, పార్దిబన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ సినిమా 'గబ్బర్ సింగ్' అంతటి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అయితే, తుది తీర్పు ఎప్పుడూ ప్రజలదే. మా వంతుగా మేమందరం మా బెస్ట్ ఎఫర్ట్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్‌లో ఏ హీరో సినిమా అయినా, అది 'పుష్ప' అయినా, ఎన్టీఆర్ గారి సినిమా అయినా, 'కల్కి' అయినా... అందరి సినిమాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరూ దేహీ అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన భారతీయ సినిమా. ఫ్యాన్ వార్స్ వదిలేసి అందరినీ గౌరవించుకుందాం.
చివరగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు లేకపోతే పవన్ కల్యాణ్ లేడు. మీకూ నాకూ మధ్య దూరం కేవలం రెండు గుండెల దూరమే. సినిమాలోని డైలాగ్‌లా "ఇచ్చిపడేసే గోత్రం, ఇరగతీసే నక్షత్రం" అని నేను చెప్పలేను. నేను చెప్పగలిగేది ఒక్కటే.. "మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం" నాది. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు, మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు. జై హింద్" అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగం ముగించారు.