Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని కావూరి నివాసానికి వెళ్లిన సీఎం, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా కావూరి సాంబశివరావు దేశానికి, రాష్ట్రానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

హెచ్.జె. దొర కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు పరామర్శ
అలాగే, ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె. దొర కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని దొర నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్ర పోలీస్ విభాగానికి దొర చేసిన సేవలను, శాఖను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఆయన చేసిన కృషిని చంద్రబాబు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.