నెతన్యాహు తనయుడు 'మిస్సింగ్'.. వారం రోజులుగా కనిపించని యాయిర్ నెతన్యాహు!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్యామిన్ నెతన్యాహు కుటుంబంపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నెతన్యాహు పెద్ద కుమారుడు యాయీర్ నెతన్యాహు (Yair Netanyahu) గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, విపక్షాలపై విరుచుకుపడే యాయీర్.. ఈ క్లిష్ట సమయంలో మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
యాయీర్ నెతన్యాహు ఎక్స్ వేదికగా రోజుకు సగటున 30 నుంచి 40 పోస్టులు చేస్తుంటారు. అయితే, మార్చి 8వ తేదీ తర్వాత ఆయన నుంచి ఒక్క పోస్ట్ కూడా రాలేదు. మార్చి 9న ఒక చిన్న రీపోస్ట్ తప్ప, ఆయన సొంతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవైపు నెతన్యాహు ఆరోగ్యంపై, ప్రాణహానిపై ఇరాన్ అనుకూల మీడియా వార్తలు ప్రసారం చేస్తున్న వేళ, యాయీర్ ఇలా 'మాయం' అవ్వడం "కుటుంబంలో ఏదైనా విషాదం జరిగిందా?" అనే పుకార్లకు దారితీసింది.
ప్రస్తుతం యాయీర్ నెతన్యాహు అమెరికాలోని మయామిలో నివసిస్తున్నట్లు సమాచారం. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అమెరికాలోని ఇజ్రాయెల్ ప్రముఖుల కుటుంబ సభ్యులకు భద్రతా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా మాజీ నిఘా అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో యాయీర్ వంటి వ్యక్తులు బహిరంగంగా తిరగడం లేదా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ప్రమాదకరమని, అందుకే ఆయనకు 'లో ప్రొఫైల్' మెయింటైన్ చేయాలని సూచించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
నెతన్యాహు మరణించారని వస్తున్న వార్తలను ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అవన్నీ 'ఫేక్ న్యూస్' అని, ప్రధాని క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది. యాయీర్ మౌనం కేవలం భద్రతా జాగ్రత్తల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ఒక 'ట్విట్టర్ అడిక్ట్' ఇలా వారం రోజులు సైలెంట్‌గా ఉండటం మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.