విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు సామాన్యుల ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భద్రతా కారణాలు, యూఏఈ విమానాశ్రయాల్లో విధించిన ఆంక్షల నేపథ్యంలో ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు ఆదివారం (మార్చి 15) తమ సర్వీసులను రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు ఈ మేరకు కీలక ప్రకటనలు విడుదల చేశాయి.
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు పశ్చిమాసియాలోని వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, ఇతర గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఇండిగో సంస్థ కూడా దుబాయ్‌కు నడిపే తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధం కారణంగా గగనతలంలో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థలు తెలిపాయి.
విమానాలు రద్దైన నేపథ్యంలో ప్రయాణికులకు పూర్తి రిఫండ్ లేదా తదుపరి అందుబాటులో ఉన్న విమానాల్లో ఉచితంగా టికెట్ మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా తమ ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇరాన్-అమెరికా మధ్య క్షిపణి దాడులు జరుగుతున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం తమ గగనతలం, విమానాశ్రయాలపై కఠిన ఆంక్షలు విధించింది. క్షిపణుల ముప్పు పొంచి ఉన్నందున అంతర్జాతీయ విమానాల రాకపోకలను పరిమితం చేశారు.