తన కూతురుని కాపాడాలని సీఎంని కోరిన మోనాలిసా తండ్రి

Monalisas Father Appeals to CM to Save His Daughter
  • ముస్లిం యువకుడిని పెళ్లాడిన కుంభమేళా ఫేమ్ మోనాలిసా
  • తన కూతురుని లవ్ జిహాద్ కు గురి చేశారంటున్న తండ్రి జైసింగ్ భోస్లే
  • తమ పార్ధి కమ్యూనిటీలో ప్రేమ వివాహాలపై కఠిన నిషేధాలు ఉంటాయని ఆవేదన

మధ్యప్రదేశ్‌కు చెందిన కుంభమేళా మోనాలిసా వివాహం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సంచార ‘పార్ధి’ తెగకు చెందిన ఆమె, ఒక ముస్లిం యువకుడిని వివాహం చేసుకోవడంపై ఆమె తండ్రి జైసింగ్ భోస్లే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.


తన కుమార్తెను మోసపూరితంగా ప్రేమలోకి దించి, 'లవ్ జిహాద్'కు గురిచేశారని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తన కుమార్తె జీవితాన్ని ఈ వివాహంతో నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను ఆయన కోరారు.


మరోవైపు, ‘పార్ధి’ కమ్యూనిటీలో ప్రేమ వివాహాలపై కఠినమైన నిషేధాలు ఉన్నాయి. ఇలాంటి వివాహాలు చేసుకున్న వారిని సమాజం నుంచి వెలివేసే ప్రమాదం ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హిందూ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని, మోనాలిసాను తిరిగి ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Go Back to Shorts
Monalisa
Monalisa marriage
Madhya Pradesh
Mohan Yadav
Love Jihad
Pardhi community
Hindu Jagran Manch
Interfaith marriage

More Telugu News