హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లికి నో చెప్పిందని యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు

Hyderabad Man Injects Woman With AIDS Blood For Refusing Marriage
  • హైదరాబాద్‌లో యువతికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన యువకుడు
  • పెళ్లికి నిరాకరించిందనే కక్షతో ఈ దారుణానికి పాల్పడిన వైనం
  • తనకు ఎయిడ్స్ ఉందని దాచి పెళ్లికి సిద్ధమైన నిందితుడు
  • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు  
హైదరాబాద్‌లోని పోచారం ప్రాంతంలో అత్యంత అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు, యువతికి హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్‌ ద్వారా బలవంతంగా ఎక్కించాడు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను తలపించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే... పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడు ఎయిడ్స్ బాధితుడు. అతనికి, అతని తల్లిదండ్రులకు కూడా ఈ వ్యాధి ఉంది. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టి ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న మనోహర్, ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల‌ 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె అందుకు ససేమిరా అనడంతో తన వెంట తెచ్చుకున్న సిరంజిలోని హెచ్‌ఐవీ రక్తాన్ని ఆమె శరీరంలోకి బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Go Back to Shorts
HIV
Manohar
Hyderabad
AIDS
Crime
Pochampally
Blood Injection
Marriage Rejection
Andhra Pradesh Crime
Police Investigation

More Telugu News