Bhumi Pednekar: రణవీర్ తో కలిసి నటించడం నా డ్రీమ్: భూమి పెడ్నేకర్

Bhumi Pednekar Dreams of Acting with Ranveer Singh

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ చూసిన తర్వాత ఆ సినిమా మేకింగ్‌కు తాను ఫిదా అయ్యానని, దర్శకుడు ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్‌లతో కలిసి పనిచేయడం తన కల అని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా మితిమీరిన మాస్ ఎలిమెంట్స్ ఉండే చిత్రాలు చూస్తే తనకు నిద్ర వస్తుందని, కానీ ‘ధురంధర్’ మాత్రం తనను కట్టిపడేసిందని భూమి నిజాయతీగా చెప్పారు.


సినిమా కలెక్షన్ల ధోరణిపై కూడా భూమి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిశ్రమలో 'ఓపెనింగ్ వీకెండ్' కలెక్షన్ల ఆధారంగానే సినిమా ఫలితాన్ని నిర్ణయించేస్తున్నారని, దీనివల్ల కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు థియేటర్లలో నిలబడలేకపోతున్నాయని ఆమె విశ్లేషించారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు నెమ్మదిగా ప్రేక్షకాదరణ పొందుతాయని, కానీ శుక్రవారం నాటి అంకెలను చూసి జడ్జిమెంట్ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఇమ్రాన్ ఖాన్ చాలా కాలం తర్వాత తిరిగి వెండితెరపైకి వస్తున్న ‘అధూరే హమ్ అధూరే తుమ్’ చిత్రంలో నటిస్తున్నారు.

Bhumi Pednekar
Ranveer Singh
Bollywood
Adhure Hum Adhure Tum
Hindi Cinema
Spy Thriller
Dhurandar
Aditya Dhar
Box Office Collections
Imran Khan

More Telugu News