Tehran Explosion: ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే... ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు
- టెహ్రాన్‌లో కుద్స్ డే ర్యాలీని లక్ష్యంగా చేసుకుని భారీ పేలుడు
- దాడికి ముందే ఫార్సీ భాషలో మ్యాప్‌లతో ఇజ్రాయెల్ హెచ్చరికలు
- చహర్రా-ఇ వెలియాస్ర్, మేయ్దాన్-ఇ తౌహిద్ ప్రాంతాల్లో అలర్ట్
- పేలుడులో ప్రాణనష్టంపై ఇరాన్ నుంచి రాని అధికారిక ప్రకటన
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలు
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. పాలస్తీనాకు మద్దతుగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న 'కుద్స్ డే' (Quds Day) ర్యాలీలో ఊహించని విధంగా తీవ్ర విస్ఫోటనం సంభవించింది. ఇజ్రాయెల్ సైన్యం బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.
దాడికి ముందు ఇజ్రాయెల్ సైన్యం తమ అధికారిక పెర్షియన్ (ఫార్సీ) సోషల్ మీడియా ఖాతా ద్వారా మూడు మ్యాప్‌లను పంచుకుంది. టెహ్రాన్‌లోని చహర్రా-ఇ వెలియాస్ర్, మేయ్దాన్-ఇ తౌహిద్, విల్లాస్ ప్రాంతాలను ఎరుపు రంగుతో మార్క్ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని, త్వరలోనే దాడులు జరుగుతాయని చాలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
ఈ హెచ్చరికలు వెలువడిన కొద్ది సమయానికే, టెహ్రాన్ యూనివర్సిటీ వైపు వెళుతున్న కుద్స్ డే ర్యాలీ సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పాలస్తీనాతో సంఘీభావం తెలుపుతూ ఇరాన్ ప్రజలు ఈ నిరసనలు చేపడుతుంటారు. పేలుడు దెబ్బకు ఆకాశంలోకి దట్టమైన పొగలు ఎగిసిపడటంతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు.
ప్రస్తుతం ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది గాయపడ్డారు అనే దానిపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. ఇజ్రాయెల్ ముందస్తు హెచ్చరికలు చేసిన వెంటనే ఈ పేలుడు జరగడం పశ్చిమాసియాలో మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది.