Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాన్నకి ఆ హీరో అంటే ఇష్టం: నర్రా వెంకటేశ్వరరావు కూతురు వసంత

Narra Vasantha Interview
Advertisement
  • విలన్ గా మెప్పించిన నర్రా వెంకటేశ్వరరావు
  • అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన టి.కృష్ణ
  • శోభన్ బాబు సూచనను పాటించిన నటుడు 
  • డబ్బుకీ .. సమయానికి విలువనిచ్చేవారన్న కూతురు   
   
Advertisement
నర్రా వెంకటేశ్వరరావు .. ఈ పేరు ఒకప్పటి ఆడియన్స్ కి బాగా తెలుసు. తెలుగు తెరపై విలేజ్ నేపథ్యంతో కూడిన విలనిజాన్ని తనదైన శైలిలో పరిగెత్తించిన నటుడాయన. డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ .. ఆయన విలనిజంలోని విలక్షణతను చాటుతూ ఉండేవి. నెగెటివ్ షేడ్స్ తో కూడిన రాజకీయనాయకుడిగా .. పోలీస్ ఆఫీసర్ గా  .. లాయర్ గా ఆయన తెరపై ఎక్కువగా కనిపించారు. అలాంటి నర్రా వెంకటేశ్వరావు గురించిన విషయాలను ఆయన కుటుంబ సభ్యులు 'సుమన్ టీవీ'తో పంచుకున్నారు. 

నర్రా కూతురు వసంత మాట్లాడుతూ .. "నాన్నగారికి నటన అంటే చాలా ఇష్టం. చదువుకునే రోజులలోనే ఆయన నాటకాలు వేసేవారట. టి. కృష్ణగారు .. నాన్నగారు ఒకే కాలేజ్ లో చదువుకున్నారు .. ఇద్దరూ మంచి స్నేహితులు. నాన్నగారు టి.కృష్ణగారి సినిమాలతో పాప్యులర్ అయ్యారు. అందువలన కెరియర్ ఆరంభంలో అవకాశాల కోసం ఆయన ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు. తనకి వచ్చిన పాత్రలో మెప్పించడం గురించి మాత్రమే ఆలోచన చేసేవారు" అని అన్నారు. 

"నాన్నగారు వరుస సినిమాలు చేస్తూ వెళ్లేవారు. అయినా ఫ్యామిలీని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేవారు.  సినిమాల గురించిన విషయాలను ఇంట్లో అస్సలు ప్రస్తావించేవారు కాదు. ఆయనకి ఇష్టమైన హీరో మాత్రం శోభన్ బాబు అని మాకు అర్థమైంది. శోభన్ బాబుగారి సలహాతోనే భూములను ఎక్కువగా కొంటూ వెళ్లారు. డబ్బు - సమయం విషయంలో ఆయన ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవారు. ఈ రోజున మేము ఏ ఇబ్బందీ లేకుండా ఉండటానికి కారణం, ఆయన ముందు చూపేనని అనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పారు. 

Advertisement
Advertisement
Narra Venkateswara Rao
Telugu actor
villain actor
T Krishna
Shoban Babu
Telugu cinema
Vasantha Narra
family interview

More Telugu News