'ధురంధర్-2' నుంచి 'ఆరి ఆరి' పాట‌ విడుద‌ల‌.. క్రేజీ సాంగ్‌తో మరింత పెరిగిన హైప్!

  • రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్'-2 నుంచి 'ఆరి ఆరి' రీమిక్స్ సాంగ్ విడుదల
  • రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్
  • ద్విపాత్రాభినయంలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో
  • అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'స్త్రీ 2' రికార్డులను అధిగమించిన చిత్రం
  • ఉగాది, ఈద్ కానుకగా ఈ నెల‌ 19న పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ధురంధర్ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టరో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో అంచనాలను ఆకాశానికి చేర్చిన ఈ చిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని ఊపిన బాంబే రాకర్స్ పాప్యులర్ సాంగ్ 'ఆరి ఆరి'కి ఆధునిక హంగులు అద్ది, కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఈ పాట సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది.

ప్రముఖ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ ఈ క్లాసిక్ హిట్‌ను నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ బీట్స్‌తో రీమిక్స్ చేశారు. రణ్‌వీర్ సింగ్ తనదైన ఎనర్జీ, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటకు ప్రాణం పోశాడు. ఇప్పటికే 310 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసిన ట్రైలర్ తర్వాత, ఈ పాట విడుదలతో సినిమా ప్రమోషన్లు మరో స్థాయికి చేరాయి. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్... జస్కీరత్ సింగ్ రంగీ, హమ్జా అనే రెండు పూర్తి విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. భారత గూఢచారి వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా ఈ నెల‌ 19న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఇక 18న సాయంత్రం నుంచే పెయిడ్ ప్రివ్యూలను భారీ ఎత్తున ప్రదర్శించనున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ‘స్త్రీ 2’ పేరిట ఉన్న రికార్డులను అధిగమించి, ఆల్-టైమ్ రికార్డు దిశగా దూసుకుపోతోంది.



More Telugu News