పెళ్లి బృందం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి.. నిర్మల్ జిల్లాలో ఘోరం
- కొండాపూర్ బైపాస్ వద్ద పేలిన వాహనం టైర్
- ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం
- పెళ్లి బృందంలోని మరో 15 మందికి గాయాలు
నిర్మల్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రూరల్ మండలం కొండాపూర్ బైపాస్ వద్ద పెళ్లి బృందంతో వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 17 మంది ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఇచ్చోడ మండలం సోన్‌పల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం బంధువులతో కలిసి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరగనున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు డీసీఎంలో బయలుదేరారు. వాహనం కొండాపూర్ బైపాస్ సమీపానికి చేరుకోగానే టైరు పేలిపోవడంతో స్టీరింగ్ పై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీనితో వాహనం రోడ్డుపై పల్టీలు కొట్టి పక్కకు పడిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.