Malaika Arora: మలైకాతో డేటింగ్ వార్తలపై యువ నటుడు సోరబ్ బేడీ స్పందన
- తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన సోరబ్ బేడీతో మలైకా డేటింగ్ చేస్తోందంటూ వార్తలు
- తమ బంధం కేవలం స్నేహం మాత్రమేనన్న సోరబ్
- చౌకబారు కామెంట్స్ వల్ల ఆమె మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని ఆవేదన
52 ఏళ్ల బాలీవుడ్ ఫిట్‌నెస్ బ్యూటీ మలైకా అరోరా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన మోడల్, నటుడు సోరబ్ బేడితో డేటింగ్‌లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఒక పార్టీలో వీరిద్దరూ కలిసి డాన్స్ చేయడం, హగ్ చేసుకుని ఫొటోలు దిగడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అయితే, ఈ వార్తలపై సోరబ్ బేడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఆ రూమర్స్‌ను పూర్తిగా కొట్టిపడేశాడు. మలైకాతో తనకున్న బంధం కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేశాడు.
మోడలింగ్ రోజుల్లో తన మెంటార్లయిన డెల్నాజ్ దారువాలా, వాహ్బిజ్ మెహతా ద్వారా మలైకాతో పరిచయం ఏర్పడిందని, గత నాలుగేళ్లుగా తామంతా ఒకే ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నామని సోరబ్ తెలిపాడు. తాను మలైకాతో పార్టీలకు వెళ్లడం ఇదే మొదటిసారి కాదని... గతంలో కూడా ఆమెతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశానని చెప్పాడు. అప్పుడు తాను ఫేమస్ కాకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదని... ఇప్పుడు తన ముఖం అందరికీ తెలియడంతో వార్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డాడు.
ఒక అమ్మాయి గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని... ఇలాంటి చౌకబారు కామెంట్స్ వల్ల ఆమె మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని సోరబ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ఒకరినొకరు నమ్ముతాము, కానీ జనం దాన్ని మరోలా చూస్తున్నారని విమర్శించాడు.