Vijay: విజయ్ ఎన్డీయేలో చేరతారంటూ ప్రచారం... స్పందించిన అన్నామలై

Vijay TVK Not Joining NDA Says Annamalai
  • అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీవీకే కలవవని స్పష్టీకరణ
  • రెండు పార్టీల సిద్ధాంతాలు వేర్వేరు అన్న అన్నామలై
  • టీ, కాఫీ కలిపి తాగలేమన్న అన్నామలై
ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ఎన్డీయేలో చేరతారనే ప్రచారంపై తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై స్పందించారు. బీజేపీ, టీవీకే పార్టీలు టీ, కాఫీ వంటివని, అవి ఎప్పటికీ కలవవని స్పష్టం చేశారు. రెండు పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వేరని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ కూడా బీజేపీతో టీవీకే కలుస్తుందనే వార్తలను ఖండించారని వెల్లడించారు.

తాము ఎవరితోనూ చర్చలు జరపలేదని వెల్లడించారు. తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. టీవీకే పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తానని చెబుతున్నట్లు తాను విన్నానని అన్నారు. తాము కూడా వారితో కలవడానికి ఆసక్తిగా లేమని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఇక్కడ పొత్తుల గురించి చర్చ ఎక్కడిదని ప్రశ్నించారు.

తమిళనాడు ప్రజలు ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలో ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆలోచనలు ఎన్డీయే వైపు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఎవరితో వెళ్లాలో టీవీకే ఇష్టమని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు టీవీకే, బీజేపీ కలిసి వెళతాయని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. విజయ్ సీబీఐ విచారణకు ఎన్నికలకు సంబంధం లేదని అన్నారు.
Vijay
Vijay TVK
Annamalai
Tamil Nadu BJP
BJP TVK alliance
Tamil Nadu politics
NDA alliance

More Telugu News