బంగ్లాదేశ్‌లో యూనివర్సిటీల మూసివేత... కారణం ఇదే!
- పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు
- తీవ్రమవుతున్న అంతర్జాతీయ ఇంధన సంక్షోభం
- ఇప్పటినుంచే జాగ్రత్తపడుతున్న బంగ్లాదేశ్
- ఇంధనం పొదుపు చేసేందుకు విద్యాసంస్థల మూసివేత
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన అంతర్జాతీయ ఇంధన సంక్షోభం బంగ్లాదేశ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్, ఇంధనాన్ని ఆదా చేసే చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రంజాన్ (ఈద్ ఉల్-ఫితర్) పండుగ ముగిసే వరకు ఈ సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
జాతీయ స్థాయిలో విద్యుత్, ఇంధనాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని, వర్సిటీల్లోని అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానిక పత్రిక 'ప్రోథోమ్ అలో' వెల్లడించింది. దీనికోసం వాహనాల వినియోగం తగ్గించడం సహా 11 కీలక మార్గదర్శకాలను విద్యాశాఖ జారీ చేసింది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడం, ఆ తర్వాత ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిణామాల ప్రభావం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లపై పడింది. దీంతో బంగ్లాదేశ్‌లో ఇంధన కొరత వస్తుందన్న భయంతో ఢాకా, ఛట్టోగ్రామ్ తదితర ప్రాంతాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.
బంగ్లాదేశ్ తమ ఇంధన అవసరాల కోసం ప్రధానంగా మిడిల్ ఈస్ట్ దేశాలపైనే ఆధారపడింది. అయితే, చమురు రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధి మూసివేతతో ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని 'ది డైలీ స్టార్' పత్రిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి నెలకొనడంతో దేశంలో రవాణా, పరిశ్రమలు, గృహ అవసరాలకు ఇబ్బందులు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.