Adah Sharma: ఆ నిర్మాత వల్ల నెల రోజులు ఖాళీగా ఉన్నా... నా మేనేజర్‌ను బూతులు తిట్టారు: ఆదాశర్మ

Adah Sharma Reveals Producer Abused Manager Causing Month Long Hiatus
  • నిర్మాత వల్ల ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్న ఆదా శర్మ
  • డేట్స్ విషయంలో తన మేనేజర్‌ను ఓ నిర్మాత బూతులు తిట్టారని ఆవేదన
  • అడిగిన డేట్స్ ఇచ్చాక ఆ నిర్మాత షూటింగ్ క్యాన్సిల్ చేశాడని వెల్లడి
  • ఆ నిర్మాత తీరుతో నెల రోజులుగా ఇంటికే పరిమితమైనట్లు ఆదా ఆవేదన
  • ది కేరళ స్టోరీ సీక్వెల్‌లో నటించకపోవడంపైనా క్లారిటీ
బాలీవుడ్ నటి ఆదా శర్మ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. డేట్స్ సర్దుబాటు చేసే క్రమంలో ఓ నిర్మాత తన మేనేజర్‌ను బూతులు తిట్టారని, ఆ నిర్మాత తీరు వల్ల తాను నెల రోజుల పాటు ఎలాంటి పని లేకుండా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

తాను ఒకే సమయంలో మూడు సినిమాలకు అంగీకరించానని, అయితే మొదటి సినిమా డేట్స్ పదే పదే మారడంతో మిగతా రెండు ప్రాజెక్టుల షెడ్యూల్స్‌కు ఇబ్బంది వచ్చిందని ఆదా తెలిపారు. అయినా సరే మొదటి సినిమా నిర్మాత తనకు ఆ పలానా తేదీలే కావాలని పట్టుబట్టారని, ఈ క్రమంలో తన మేనేజర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె వెల్లడించారు.

ఈ విషయం తెలుసుకున్న మిగతా ఇద్దరు దర్శకులు చాలా హుందాగా వ్యవహరించి తమ షూటింగ్ తేదీలను మార్చుకున్నారని ఆదా వివరించారు. మూడో సినిమా నిర్మాత అయితే తనకోసం ఏకంగా ఇతర నటీనటుల డేట్స్ కూడా అడ్జస్ట్ చేశారన్నారు. "ఇండస్ట్రీలో చెడ్డవాళ్లే కాదు, మంచివాళ్లు కూడా ఉన్నారని చెప్పడానికే ఈ విషయం చెబుతున్నా" అని ఆమె అన్నారు. అయితే, అందరూ సర్దుబాటు చేసుకున్నాక, మొదటి సినిమా నిర్మాత మాత్రం తనకు ఇప్పుడు ఆ డేట్స్ వద్దని చెప్పడంతో తాను మానసికంగా, ఆర్థికంగా దెబ్బతిన్నానని ఆదా వాపోయారు.

ఇదే సమయంలో 'ది కేరళ స్టోరీ' సీక్వెల్‌లో తాను ఎందుకు నటించడం లేదన్న దానిపై కూడా ఆదా శర్మ స్పందించారు. తాను భాగం కాని సినిమా గురించి వార్తల్లో నిలవడం కోసం మాట్లాడటం సరికాదన్నారు. తనకు సీక్వెల్‌లో అవకాశం వచ్చిందా లేదా అనేది మేకర్స్, తన మధ్య ఉండాల్సిన విషయమని స్పష్టం చేశారు. మొదటి భాగం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐసిస్ క్యాంపుల నేపథ్యంలో సాగితే, రెండో భాగం పూర్తిగా భిన్నమైన కథ అని ఆమె తెలిపారు.


Adah Sharma
Bollywood actress
movie dates
film industry
The Kerala Story
movie schedule
film producer
ISIS camps
movie sequel
manager abuse

More Telugu News