టీ20 ప్రపంచకప్ సాధించిన టీమిండియా.. కోచ్ గంభీర్ ఆసక్తికర ట్వీట్

  • వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ సాధించిన టీమిండియా
  • 2007లో తొలిసారి కప్ సాధించిన భారత్
  • ఇది దేవుడి ప్లాన్ మాత్రమే కాదు.. 140 కోట్ల భారతీయుల ప్లాన్ అని ట్వీట్
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ అద్భుత విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండుసార్లు కప్ సాధించిన టీమిండియా, మొత్తంగా మూడుసార్లు టీ20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.

టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా విజయం సాధించడంపై స్పందిస్తూ, ఇది కేవలం దేవుడి ప్లాన్ మాత్రమే కాదని, 140 కోట్ల మంది భారతీయుల ప్రణాళిక అని పేర్కొన్నారు. ప్రపంచ కప్‌లో ప్రతి క్రీడాకారుడు కూడా ఛాంపియన్ అని పేర్కొన్నారు. టీమిండియా 2007, 2024, తాజాగా 2026లో టీ20 ప్రపంచకప్‌లు సాధించింది.

Gautam Gambhir
T20 World Cup
Team India
Indian Cricket Team
Cricket World Cup

More Telugu News