భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్... ఎందుకంటే..!
- ఇరాన్ యుద్ధనౌకకు కొచ్చిలో ఆశ్రయం కల్పించడంపై భారత్‌కు టెహ్రాన్ కృతజ్ఞతలు
- రాజ్యసభలో పశ్చిమాసియా పరిణామాలపై కీలక ప్రకటన చేసిన జైశంకర్
- సాంకేతిక సమస్యల కారణంగా మానవతా దృక్పథంతోనే అనుమతి ఇచ్చామన్న మంత్రి
- శాంతియుత వాతావరణం, ఇంధన భద్రత, భారతీయుల రక్షణే తమ ప్రాధాన్యమని స్పష్టీకరణ
- సభలో విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన జేపీ నడ్డా
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, కొచ్చి ఓడరేవులో తమ యుద్ధనౌకకు ఆశ్రయం కల్పించినందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. సోమవారం నాడు రాజ్యసభలో పశ్చిమాసియా పరిస్థితులపై ఆయన కీలక ప్రకటన చేశారు.
శ్రీలంక సమీపంలో ఇరాన్‌కు చెందిన 'ఐఆర్ఐఎస్ దేనా' యుద్ధనౌక అమెరికా జలాంతర్గామి దాడికి గురై మునిగిపోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న మరో ఇరాన్ యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ లావన్' భారత్ సాయం కోరింది. అందుకు భారత్ వెంటనే స్పందించి, కొచ్చి పోర్టులో డాక్ చేసేందుకు అంగీకరించింది.
దీనిపై స్పందించిన జైశంకర్.. "ఫిబ్రవరి 20న ఇరాన్ మూడు నౌకల కోసం అనుమతి కోరగా, మార్చి 1న కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో మార్చి 4న కొచ్చికి చేరుకున్న ఆ నౌక సిబ్బందికి ప్రస్తుతం భారత నౌకాదళ కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్నాం. మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే" అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 20, మార్చి 5 తేదీల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో తాను మాట్లాడినట్లు ఆయన సభకు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభంపై భారత్ మూడు విధానాలకు కట్టుబడి ఉందన్నారు. చర్చల ద్వారా శాంతిని నెలకొల్పడం, ఆ ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రత, అలాగే దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.
మరోవైపు, జైశంకర్ ప్రకటన సమయంలో విపక్షాలు వ్యవహరించిన తీరుపై సభా నాయకుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్షాలకు జాతీయ ప్రయోజనాల కంటే రాజకీయాలు, సభలో గందరగోళం సృష్టించడం మీదే ఆసక్తి ఎక్కువని విమర్శించారు. గతంలో వక్ఫ్ బిల్లు, బడ్జెట్ సమావేశాలు, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా విపక్షాలు ఇలాగే సభ నుంచి వాకౌట్ చేశాయని ఆయన గుర్తుచేశారు. ఆత్మనిర్భర్ భారత్ పట్ల వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నడ్డా ధ్వజమెత్తారు.