బళ్లారి పాఠశాలలో తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడి.. కర్నూలు జిల్లా విద్యార్థి మృతి

Kurnool Student Death in Ballari School Iron Rod Attack
  • రాత్రి పడుకున్న సమయంలో దాడి చేసిన విద్యార్థి
  • ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
  • పరారీలో దాడి చేసిన విద్యార్థి
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఓ పాఠశాల హాస్టల్‌లో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. పడుకున్న తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడి చేయగా ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన చిన్న వివాదం ఒక విద్యార్థి ప్రాణం తీసే వరకు వచ్చింది. దాడి చేసిన విద్యార్థి పరారీలో ఉన్నాడు.

హాస్టల్‌లోని తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో మరణించిన విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన బాలుడిగా గుర్తించారు. విషయం తెలియగానే జిల్లా పోలీసు అధికారి డాక్టర్ డి సుమన్ పెన్నేకర్ పాఠశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు.
Go Back to Shorts
Kurnool Student Death
Ballari School Attack
Karnataka School Violence
Gurukul International School
School Hostel Fight

More Telugu News