ఆదాయనికి మించిన ఆస్తులు... గజ్వేల్ తహసీల్దార్‌ను అరెస్టు చేసిన ఏసీబీ

  • కరీంనగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
  • రూ.4 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించిన ఏసీబీ
  • బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కమతం శ్రవణ్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని హిందూపూర్ కాలనీలోని ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష్మీనగర్‌లోని శ్రవణ్ కుమార్ తండ్రి, సోదరి ఇళ్లలో సోదాలు చేశారు.

మొత్తం మూడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి రూ.4 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. ఇందులో వివిధ పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదు ఉన్నాయి. సోదాలు కొనసాగుతున్నాయని, నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ఏసీబీ అధికారులు సోదాలు చేయడానికి వస్తున్న సమాచారం తెలిసిన శ్రవణ్ తన ఇంటి పైనుంచి ఒక బ్యాగును కిందకు విసిరేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రవణ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

Kamatham Shravan Kumar
Gajwel Tahsildar
ACB Raids
Disproportionate Assets Case
Siddipet District

More Telugu News