Muddada Ravichandra: టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

Muddada Ravichandra Takes Charge as New TTD EO
  • రవిచంద్ర చేత ఈవోగా ప్రమాణస్వీకారం చేయించిన ఏఈవో వెంకయ్య చౌదరి
  • శ్రీవారి సన్నిధిలో బంగారు వాకిలి వద్ద ప్రమాణస్వీకారం
  • ఈ అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్య
సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO)గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. తొలుత భూవరాహ స్వామిని దర్శించుకున్న ఆయన, అనంతరం శ్రీవారి సన్నిధిలో బంగారు వాకిలి వద్ద టీటీడీ బోర్డు ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు.

వేద పండితుల ఆశీర్వచనం అనంతరం రవిచంద్ర మాట్లాడుతూ... శ్రీవారికి సేవ చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లలో పారదర్శకత పెంచుతామని చెప్పారు. తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Muddada Ravichandra
TTD EO
Tirumala Tirupati Devasthanam
TTD Board
Venkataiah Chowdary
Chandrababu Naidu
Tirumala Temple
Andhra Pradesh
Hindu Temple

More Telugu News