Sukhoi Su-30MKI: అసోంలో అదృశ్యమైన సుఖోయ్ యుద్ధ విమానం.. తీవ్రస్థాయిలో గాలింపు
- భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం అదృశ్యం
- రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో రంగంలోకి దిగిన గాలింపు బృందాలు
- ఘటనను ధ్రువీకరించిన లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్
- విమానంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది
భారత వాయుసేనలో కీలకమైన సుఖోయ్ (ఎస్ యూ-30ఎంకేఐ) యుద్ధ విమానం అదృశ్యమవడం కలకలం రేపింది. రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో విమానం ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు, విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
విమానం రాడార్ పరిధి నుంచి హఠాత్తుగా మాయమైందని, పైలట్ల రక్షణ కోసం వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ స్పందించారు. విమానం రాడార్ కాంటాక్ట్ కోల్పోయిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
సుఖోయ్ ఎస్ యూ-30ఎంకేఐ భారత వాయుసేనలో అత్యంత శక్తివంతమైన మల్టీ-రోల్ ఫైటర్ జెట్‌గా గుర్తింపు పొందింది. రష్యా నుంచి సేకరించిన ఈ విమానాలు సరిహద్దు రక్షణతో పాటు కీలకమైన ఆపరేషన్లలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అటువంటి అత్యాధునిక విమానం అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ప్రమాదం ఎక్కడ జరిగి ఉండవచ్చు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సిబ్బందిని సురక్షితంగా గుర్తించేందుకు వైమానిక దళం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ తెలియాల్సి ఉంది.