రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్

  • కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్
  • ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక
  • నవ దంపతులను ఆశీర్వదించిన జగన్

వైసీపీ అధినేత జగన్ కడప పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో సందడి చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై, నవ దంపతులు కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలను ఆశీర్వదించారు. జగన్ రాకతో ప్రొద్దుటూరు పట్టణం జన సందోహంగా మారింది. హెలిప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకు దారి పొడవునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభివాదం చేశారు.


ఆయనపై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ కూడా వాహనం నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ అందరినీ పలకరించారు. అభిమానుల కోలాహలం మధ్య జగన్ వాహనం నెమ్మదిగా ముందుకు సాగింది. ఈ పర్యటనలో స్థానిక నేతలు, మాజీ మంత్రులు కూడా ఆయన వెంట ఉన్నారు. 



More Telugu News