ప్రేతాత్మ ఎదురుచూసేది ఎవరి కోసం?: ఓటీటీలో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
- తమిళంలో రూపొందిన 'గ్రానీ'
- ప్రధానమైన పాత్రలో విజీ చంద్రశేఖర్
- ఆహా తమిళ ఓటీటీకి స్ట్రీమింగ్ హక్కులు
- ఈ నెల 6వ తేదీ నుంచి అందుబాటులోకి
వృద్ధురాలైన ఒక ప్రేతాత్మ .. ఒక యువ జంట .. ఒక పాప చుట్టూ తిరిగే కథ ఇది. అలాంటి ఈ కథతో రూపొందిన ఈ సినిమా, జనవరి 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ద్వారా పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి 'ఆహా తమిళం' ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా అర్థమవుతోంది.
పాత బంగళాలలో ఉన్న ప్రేతాత్మ ఎవరు? ఎందుకు ప్రేతాత్మగా మిగిలిపోయింది? ఎవరి కోసం ఎదురుచూస్తోంది? ఆ ప్రేతాత్మ ఏం ఆశిస్తోంది? అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను విజీ చంద్రశేఖర్ పోషించింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఆమె లుక్ .. నటన గురించి చాలామంది మాట్లాడుకున్నారు. విజయ్ కుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలో తెలుగులోను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.