ప్రేతాత్మ ఎదురుచూసేది ఎవరి కోసం?: ఓటీటీలో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'

  • తమిళంలో రూపొందిన 'గ్రానీ'
  • ప్రధానమైన పాత్రలో విజీ చంద్రశేఖర్
  • ఆహా తమిళ ఓటీటీకి స్ట్రీమింగ్  హక్కులు 
  • ఈ నెల 6వ తేదీ నుంచి అందుబాటులోకి  

ఎవరూ నివసించని ఒక పాత బంగళాలో ఒక ప్రేతాత్మ తిరుగుతూ ఉంటుంది. అక్కడ దెయ్యం ఉందనే సంగతి తెలియని ఒక జంట ఆ ఇంట్లో ఉండవలసి వస్తుంది. తప్పనిసరి పరిస్థితులలో ఆ జంట ఆ ఇంట్లో నివసించవలసి వస్తుంది. అయితే ప్రేతాత్మ కారణంగా ఆ జంటకి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకు కారణమేమిటనేది వాళ్లకి అర్థం కాదు. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటారు? అనేది కథ. 

వృద్ధురాలైన ఒక ప్రేతాత్మ .. ఒక యువ జంట .. ఒక పాప చుట్టూ తిరిగే కథ ఇది. అలాంటి ఈ కథతో రూపొందిన ఈ సినిమా, జనవరి 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ద్వారా పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి 'ఆహా తమిళం' ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. 

పాత బంగళాలలో ఉన్న ప్రేతాత్మ ఎవరు? ఎందుకు ప్రేతాత్మగా మిగిలిపోయింది? ఎవరి కోసం ఎదురుచూస్తోంది? ఆ ప్రేతాత్మ ఏం ఆశిస్తోంది? అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను విజీ చంద్రశేఖర్ పోషించింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఆమె లుక్ .. నటన గురించి చాలామంది మాట్లాడుకున్నారు. విజయ్ కుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా,  త్వరలో తెలుగులోను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.



More Telugu News