డప్పు కొట్టి, డ్యాన్సు చేసి.. జగ్గారెడ్డి హోలీ సంబరాలు
- సంగారెడ్డిలో హోలీ సంబరాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి
- స్నేహితులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న జగ్గారెడ్డి
- రామమందిరంలో ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి
సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ హోలీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన చిన్నారులతో పాటు ఆయన చిన్ననాటి మిత్రులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంగారెడ్డి బైపాస్‌లో ఈ హోలీ వేడుకలు నిర్వహించారు.
మరోవైపు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బోయినపల్లిలోని తన నివాసంలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. తన చిన్ననాటి నుంచి హోలీ వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నానని మల్లారెడ్డి తెలిపారు.