శివాజీ తనయుడికి బ్రహ్మానందం కానుక
- నటుడు శివాజీ, లయల 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమా ప్రీ రిలీజ్ వేడుక
- ముఖ్య అతిథిగా హాజరైన హాస్యనటుడు బ్రహ్మానందం
- వేదికపై శివాజీ కుమారుడికి ఉంగరాన్ని బహూకరించిన బ్రహ్మానందం
- మార్చి 6న థియేటర్లలోకి రానున్న సినిమా
నటుడు శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమా ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో నటుడు అలీ, చిత్ర బృందం, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో బ్రహ్మానందం నటనలో అలీ తన కన్నా సీనియర్ అంటూ నవ్వులు పూయించారు. ఏ ఫర్ అలీ, బీ ఫర్ బ్రహ్మానందం అంటూ చమత్కరించారు. ఈ సందర్భంగా అడ్వాన్స్‌గా ఇస్తున్నానంటూ తన చేతి ఉంగరాన్ని తీసి శివాజీ తనయుడికి అందించారు.