జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
- జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప ముఖ్యమంత్రి
- ఈ నెల 5న తన కుమారుడి వివాహానికి రావాలంటూ ఆహ్వానం
- శుభాకాంక్షలు తెలిపిన జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా జగన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వధూవరులు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. కాగా, తన కుమారుడి వివాహానికి రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ భట్టివిక్రమార్క ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.