Gudivada Amarnath: రూ.100 కోట్ల ఆలయ భూమి కబ్జా అయింది: గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath Alleges 100 Crore Temple Land Encroachment
  • అనకాపల్లిలోని కన్యాకాపరమేశ్వరి ఆలయ భూమి కబ్జా అయిందన్న గుడివాడ
  • భూ కబ్జాపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
  • చంద్రబాబు ఆధ్వర్యంలో ఒక దొంగల ముఠా ఏర్పడిందని ఆరోపణ

సనాతన ధర్మం పేరుతో రాజకీయాలు చేసే నేతలు, కోట్లాది రూపాయల విలువైన ఆలయ భూములు కబ్జా అవుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అనకాపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న కన్యకాపరమేశ్వరి దేవాలయానికి చెందిన భూములు అక్రమంగా బదలాయించారంటూ ఆయన మండిపడ్డారు.


వందేళ్ల క్రితం దాతలు కన్యకాపరమేశ్వరి ఆలయానికి 2 ఎకరాల 49 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారని... అందులో ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ కోసం కొంత తీసుకోగా, మిగిలిన 1 ఎకరా 11 సెంట్ల స్థలం ప్రస్తుతం ఉందని అమర్నాథ్ తెలిపారు. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఆయన వెల్లడించారు.


దేవాదాయ శాఖకు చెందిన ఈ విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అధికారం అధికారులకు ఎక్కడిదని ఆయన నిలదీశారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని ప్రైవేట్ స్థలంగా చూపుతూ అధికారులు ఏ ప్రాతిపదికన నివేదిక ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఒక 'దొంగల ముఠా' ఏర్పడిందని, కూటమి నేతల అండతో ప్రభుత్వ, దేవాదాయ భూములను ఈ ముఠా దోచుకుంటోందని ఆరోపించారు. రూ.100 కోట్ల విలువైన ఈ భూమి ఇప్పటికే కౌలుదారుల పేరు మీదకు మారిందని, ఈ భారీ కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.

Gudivada Amarnath
Anakapalli
Kanaka Parameswari Temple
temple land encroachment
Andhra Pradesh
CBN
TDP
YSRCP
land scam
real estate

More Telugu News