Ram Charan: ఆ డెడికేషన్, ఆ అటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్: బుచ్చిబాబు సానా

Ram Charan Dedication Inspired by Chiranjeevi Says Buchi Babu
  • పెద్ది సినిమాలోని రై రై రా రా పాటపై మెగాస్టార్ ప్రశంసలు
  • రామ్ చరణ్ గ్రేస్ ఎనర్జీ అద్భుతమంటూ చిరంజీవి ట్వీట్
  • షూటింగ్ సమయంలో చరణ్‌కు తీవ్ర జ్వరం ఉందన్న బుచ్చిబాబు
  • జ్వరంలోనూ నవ్వుతూ డ్యాన్స్ చేశారని డైరెక్టర్ వెల్లడి
  • ఆ డెడికేషన్ మీ నుంచే వచ్చిందంటూ చిరుకు బుచ్చిబాబు రిప్లై
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా నుంచి నిన్న విడుదలైన ‘రై రై రా రా’ పాట సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ పాటను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. చిత్ర బృందాన్ని, ముఖ్యంగా రామ్ చరణ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన, ఎమోషనల్ సంఘటనను పంచుకున్నారు.

చిరంజీవి తన ట్వీట్‌లో.. "స్క్రీన్ మీద రై రై రా రా పాట నిప్పులు చెరిగింది. ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియెన్స్ కలగలిపిన అద్భుతం ఇది. రామ్ చరణ్ ఎంతో గ్రేస్‌తో, మెరుపు వేగంతో డ్యాన్స్ చేయడం చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ పాటను ఇంత గొప్పగా చిత్రీకరించిన దర్శకుడు బుచ్చిబాబుకు, మ్యాజికల్ సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్‌కు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు అభినందనలు. అలాగే డీఓపీ రత్నవేలు విజువల్స్, అనంత శ్రీరామ్ సాహిత్యం, నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మాణ విలువలు అద్భుతం" అని పేర్కొన్నారు.

చిరంజీవి ప్రశంసలకు దర్శకుడు బుచ్చిబాబు ఎమోషనల్ రిప్లై ఇచ్చారు. "ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సార్. ఈ పాట షూటింగ్ చేస్తున్నప్పుడు చరణ్ సార్‌కు తీవ్రమైన జ్వరం ఉంది. షూటింగ్ ఆపేద్దామని మేము అన్నా, ఆయన ఒప్పుకోలేదు. ఆ హై ఫీవర్‌లోనూ ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ చేశారు. పని పట్ల ఆయనకున్న ఆ డెడికేషన్, ఆ ఆటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సార్" అని బుచ్చిబాబు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉండి కూడా చరణ్ చూపిన అంకితభావం గురించి తెలిసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.
Ram Charan
Peddi
Buchi Babu Sana
Chiranjeevi
Rai Rai Ra Ra song
AR Rahman
Johnny Master
Telugu movie
Mega fans
Ratnavelu

More Telugu News