నాగర్‌కర్నూల్‌కు విజయ్, రష్మిక.. సత్యనారాయణ స్వామి వ్రతం

  • కొత్త జంటగా స్వగ్రామానికి వెళ్లనున్న విజయ్-రష్మిక
  • తుమ్మనపేటలో సత్యనారాయణ స్వామి వ్రతం
  • వివాహానంతర సంప్రదాయాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
  • గ్రామస్థుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు
  • మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

వివాహానంతర సంప్రదాయాల్లో భాగంగా ఈ కొత్త జంట తమ పూర్వీకుల గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్థుల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్, రష్మికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగు, కొడ‌వ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. వివాహం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఈ జంట, ఇప్పుడు తమ స్వగ్రామంలో పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

గ్రామంలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత, మార్చి 4న హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ మిత్రులు, ఇతర ప్రముఖుల కోసం విజయ్-రష్మిక దంపతులు ఓ భారీ విందును (రిసెప్షన్) ఇవ్వనున్నారు.


More Telugu News