Jagan Mohan Reddy: కాకినాడ జిల్లా బాణాసంచా పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
- వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనపై జగన్ స్పందన
- ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై ఆవేదన
- మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వానికి సూచన
- గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన విచారాన్ని తెలియజేశారు.
ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. పేలుడు ధాటికి గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.