బొత్స త్వరగా కోలుకోవాలన్న నారా లోకేశ్, నాగబాబు

  • బొత్స త్వరగా కోలుకోవాలన్న నారా లోకేశ్
  • సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్ష
  • త్వరగా ప్రజాసేవలోకి రావాలని ప్రార్ధిస్తున్నానన్న నాగబాబు
మాజీ మంత్రి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్, జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు స్పందించారు.

ఆయన త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. తన సహచర ఎమ్మెల్సీ అయిన బొత్స త్వరగా ప్రజాసేవలోకి రావాలని ప్రార్థిస్తున్నట్లు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  
 


More Telugu News