అది ఎఫ్– 16 ఫైటర్ జెట్ కాదట.. ఫేక్ వీడియో పోస్ట్ చేశారంటున్న 'గ్రోక్'!
- పాక్ యుద్ధ విమానం కూల్చివేశామంటూ ఎక్స్ లో తాలిబన్ల వీడియో
- ఎఫ్–16 ఫైటర్ జెట్ కాదని తేల్చేసిన ‘గ్రోక్’ ఏఐ
- విమానం ఆకారం ఎఫ్-16తో సరిపోలడం లేదని వెల్లడి
వైరల్ గా మారిన వీడియో..
వైరల్ అవుతున్న వీడియోలో మంటల్లో కాలిపోతున్న విమానం తోక భాగంపై పాకిస్థాన్ జెండా, ‘85510’ అనే నంబర్లు కనిపిస్తున్నాయి. అయితే, ఆ విమానం పరిమాణం మరియు ఆకారం ఎఫ్-16 యుద్ధ విమానానికి ఏమాత్రం సరిపోలడం లేదని ఏఐ విశ్లేషణలో తేలింది. గతంలో ఎప్పుడో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను లేదా సంబంధంలేని ఇతర విమానాల శకలాలను వాడుకుని, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో పాక్‌ను దెబ్బతీయడానికి ఈ ఫేక్ వీడియోను ప్రచారంలోకి తెచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.