Sri Vishnu: విష్ణు విన్యాసం .. నయన్ విశేషం!
- 'క' సినిమాతో హిట్ కొట్టిన నయన్ సారిక
- శ్రీవిష్ణు జోడీగా 'విష్ణు విన్యాసం'
- రేపు విడుదలవుతున్న సినిమా
- తనకి మంచిపేరు వస్తుందంటున్న నయన్
రాజేంద్ర ప్రసాద్ .. అల్లరి నరేశ్ తరువాత పూర్తి స్థాయి హాస్య కథానాయకుడిగా శ్రీవిష్ణు మారిపోయాడు. నిజానికి శ్రీవిష్ణు హ్యాండ్సమ్ హీరో. తెలుగు తెరపై కనిపించే అందమైన హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విష్ణు విన్యాసం' సిద్ధమవుతోంది. మారుతీరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు థియేటర్లలో దిగిపోనుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన నాయికగా 'నయన్ సారిక' అలరించనుంది.
నయన్ సారిక పేరు వినగానే 'గం గం గణేశ' .. 'ఆయ్' సినిమాలు గుర్తొస్తాయి. ఇక తెలుగులో ఆమెకి దక్కిన తొలి హిట్ 'క' అనే చెప్పాలి. కిరణ్ అబ్బవరం జోడీగా చేసిన ఈ సినిమా, ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అలాంటి నయన్ సారిక ఇప్పుడు 'విష్ణు విన్యాసం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో తాను పోషించిన 'మనీషా' పాత్ర తనకి మరింత మంచి పేరును తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది. ఈ పాత్ర చుట్టూ చాలానే విశేషాలు ఉన్నాయని చెబుతోంది.
శ్రీ విష్ణు జోడీగా నటించడం ఒక మరిచిపోలేని అనుభవమనీ, తనకి కామెడీపై మంచి పట్టు ఉందని చెప్పింది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ నాన్ స్టాప్ గా నవ్విస్తూ ఉంటుందని తెలిపింది. ఇది తన నటనకు మంచి మార్కులు తెచ్చిపెట్టే సినిమా అవుతుందనీ .. మరిన్ని అవకాశాలు తీసుకొస్తుందనే నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చూడాలి మరి నయన్ సారిక ఖాతాలోకి మరో హిట్ వచ్చి పడుతుందేమో.