మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరైన అనిల్ అంబానీ
- ముంబైలోని రూ.3,716 కోట్ల ఇల్లు సీజ్ చేసిన ఈడీ
- రుణాల మళ్లింపు కేసులో సుదీర్ఘంగా సాగుతున్న విచారణ
- బ్యాంకులను మోసం చేసిన ఆరోపణలపై అనిల్ అంబానీని ప్రశ్నిస్తున్న అధికారులు
వరుస నష్టాలతో ఇబ్బందులు..
ఒకప్పుడు ప్రపంచ కుబేరులలో ఒకరిగా ఉన్న అనిల్ అంబానీ, గత రెండు దశాబ్దాలుగా తన వ్యాపార సామ్రాజ్యంలో వరుస నష్టాలను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ నుండి రక్షణ రంగం వరకు విస్తరించిన ఆయన వ్యాపారాలు ప్రస్తుతం దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్నాయి. తాజాగా ఈడీ జరిపిన ఈ ఆస్తుల అటాచ్‌మెంట్ మరియు సుదీర్ఘ విచారణ పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముకేశ్ అంబానీ తమ్ముడిగా అందరికీ తెలిసిన అనిల్.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఇల్లు ఇదే..