ఐ-ప్యాక్ తో ఒప్పందం కుదుర్చుకున్న అఖిలేశ్ యాదవ్
- వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
- యోగి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అఖిలేశ్ అడుగులు
- మమత, స్టాలిన్ సలహాలతో ఐ-ప్యాక్ తో ఒప్పందం
భారత రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027 ప్రారంభంలో జరగనున్నాయి. కానీ, అప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భారీ స్కెచ్ వేశారు. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా... దేశంలోనే అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తల సంస్థ 'ఐ-ప్యాక్' (I-PAC)తో అఖిలేశ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.