నందీశ్వర ఆలయంలో జగన్‌ ప్రత్యేక పూజలు

  • వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వర ఆలయాన్ని సందర్శించిన జగన్
  • విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అధినేత
  • హోమ సన్నిధిలో యజ్ఞయాగాది కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ కాసేపటి క్రితం వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నారు. నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఆయన నందిపల్లికి వచ్చారు.

నందీశ్వర ఆలయం వద్దకు చేరుకున్న జగన్ కు... ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నంది విగ్రహం వద్ద జగన్ కొబ్బరికాయ కొట్టి, పూలమాలను సమర్పించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. హోమ సన్నిధికి చేరుకుని యజ్ఞయాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం జగన్ పులివెందుల చేరుకుని, తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.


More Telugu News