తప్పించుకోవడం కోసమే అలా చేస్తాను : హీరో శ్రీవిష్ణు

Sri Vishnu Interview
షార్ట్స్‌లో చూడండి
శ్రీవిష్ణు మంచి అందగాడు .. హ్యాండ్సమ్ హీరో అనే చెప్పాలి. అయితే పూర్తిస్థాయి హాస్య ప్రధానమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూనే ఆయన ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'విష్ణు విన్యాసం'. ఈ కథలో కామెడీ టచ్ ఏ స్థాయిలో ఉంటుందనేది ఈ టైటిల్ చెబుతూనే ఉంది. సుమంత్ నాయుడు నిర్మించిన ఈ సినిమాకి, యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించాడు. ఈ నెల 27వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు 'గ్రేట్ ఆంధ్ర'తో మాట్లాడుతూ, 'ఒంగోలు' నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. హీరో మిడిల్  క్లాస్ యువకుడు .. జూనియర్ లెక్చరర్ ఆ పనిచేస్తూ ఉంటాడు. లవ్ అంటూ ఒక అమ్మాయి అతని వెంటపడుతూ ఉంటుంది. అతనికి న్యూమరాలజీపై నమ్మకం ఎక్కువ. అలాంటి హీరో ఎలాంటి చిక్కుల్లో పడతాడు? ఆ చిక్కుల్లో నుంచి ఎలా బయటపడతాడు? అనేదిమిగతా కథ" అని చెప్పాడు. 

"ఏ సినిమా చేస్తున్నా నేను నిర్మాత గురించి తప్పకుండా ఆలోచిస్తాను. సాధ్యమైనంత వరకూ బడ్జెట్ దాటకుండా చూసుకుంటాను. అసరమైతే పారితోషికం తగ్గించుకోవడానికి కూడా వెనుకాడను. కథ నాకు బాగా నచ్చితే పారితోషికం లేకుండా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. పారితోషికం కారణంగా నేను ఏ సినిమా వదులుకోలేదు. కథ నచ్చనప్పుడు .. ప్రాజెక్టు చేయడం ఇష్టం లేనప్పుడు పారితోషికం విషయాన్ని గట్టిగా పట్టుకుంటాను అంతే" అని చెప్పాడు.

Go Back to Shorts
Sree Vishnu
Vishnu Vinyaasam
Telugu Movie
Comedy Movie
Yadunath Maruthi Rao
Sumanth Naidu
Ongole
Junior Lecturer
Tollywood
Telugu Cinema

More Telugu News