మీ విజన్‌తో అద్భుతాలు చేస్తారు.. 'పెద్ది' కెమెరామెన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన రామ్ చరణ్
- 'పెద్ది' సినిమా సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చెర్రీ
- ఆయన విజన్‌తో ప్రతి ఫ్రేమ్‌లో మ్యాజిక్ ఉంటుందని ప్రశంస
- 'మెగా పవర్ బ్లాస్ట్' త్వరలో లోడ్ అవుతోందంటూ హింట్ ఇచ్చిన చిత్రబృందం
- బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న యాక్షన్ డ్రామా
- ఏప్రిల్ 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన రత్నవేలు పనితనాన్ని కొనియాడుతూ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆయన విజన్‌తో ప్రతి ఫ్రేమ్‌లో మ్యాజిక్ ఉంటుందని ప్రశంసించారు.
"పుట్టినరోజు శుభాకాంక్షలు రత్నవేలు గారు. మీతో కలిసి సెట్‌లో పనిచేయడం ఎప్పుడూ ఒక గౌరవమే. మీ విజన్ ప్రతి ఫ్రేమ్‌కు ప్రాణం పోస్తుంది. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని రామ్ చరణ్ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. మరోవైపు 'పెద్ది' చిత్రబృందం కూడా తమ అధికారిక ఖాతా ద్వారా రత్నవేలుకు విషెస్ తెలిపింది. రామ్ చరణ్, రత్నవేలు ఉన్న ఒక లొకేషన్ స్టిల్ పంచుకుంటూ, "నిప్పులు చెరిగే ఫ్రేమ్స్.. త్వరలో ఒక మెగా పవర్ బ్లాస్ట్ లోడ్ అవుతోంది" అని పోస్ట్ చేసి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో జగపతి బాబు 'అప్పలసూరి' అనే పాత్రలో నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా వెల్లడించారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రముఖ స్టంట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ నేతృత్వంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.