Roslyn: పీడకల .. నిజమవడం మొదలైతే?: ఓటీటీకి మలయాళ సిరీస్!

Roslin Series Update
  • మలయాళం నుంచి మరో సిరీస్ 
  • సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • ఈ నెల 27 నుంచి హాట్ స్టార్ లో 
  • 7 భాషల్లో అందుబాటులోకి

 'కల' ఏదైనా .. కళ్లు తెరిచేవరకూ నిజమేనని అనిపిస్తుంది. ఇక పీడకల వస్తే, భయంతో ఉలిక్కిపడి నిద్రలేవకుండా ఎవరూ ఉండరు. అలాంటి పీడకలలో కనిపించినవారు, హఠాత్తుగా ఎదురుగా వచ్చి నుంచుంటే, ఎవరైనా ఏం చేస్తారు? అలా ఎందుకు జరుగుతుంది? అలాంటి సంఘటనను ఫేస్ చేసేది ఓ పదేళ్ల పాప అయితే ఎలా ఉంటుంది? అనే కథతో రూపొందిన సిరీస్ . 'రోస్లిన్'. ఈ నెల 27వ తేదీ నుంచి ఓటీటీ ద్వారా పలకరించనున్న సిరీస్ ఇది. 

మలయాళంలో రూపొందిన సిరీస్ ఇది. వినాయక్ శశికుమార్ రాసిన కథతో .. సుమేశ్ నంద కుమార్ తెరకెక్కించాడు. జియో హాట్ స్టార్ వారు ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రధానమైన పాత్రలలో మీనా .. వినీత్ .. వారి కూతురుగా సంజయ్ దీపు నటించారు. 'దృశ్యం' దర్శకుడు జీతూ జోసెఫ్ పర్యవేక్షణలో రూపొందిన సిరీస్  కావడంతో, అందరూ ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 7 భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. 

కథలోకి వెళితే ... 'రోస్లిన్' అనే పదేళ్ల అమ్మాయికి తరచూ ఒక పీడకల వస్తూ ఉంటుంది. కలలో ఒక దుర్మార్గుడు ఫ్యామిలీని ప్రమాదంలో పడేసే పనులు చేస్తుంటాడు. కలలో కనిపించే ఆ వ్యక్తి నిజంగానే ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. చాలా తక్కువ సమయంలో రోస్లిన్ పేరెంట్స్ కి చేరువవుతాడు. అతని రాకతో ఆ ఇంట్లో చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అప్పుడు రోస్లిన్ ఏం చేస్తుంది? అనేది కథ. 

Roslyn
Malayalam series
OTT series
Jio Hotstar
Meena
Vineeth
Sanjay Deepu
Jeethu Joseph
Thriller series
Horror series

More Telugu News