రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు

  • రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ నాయక్
  • పాట్నాలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
  • బీహార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన ఏపీ పోలీసులు
  • ట్రాన్సిట్ వారెంట్ ద్వారా గుంటూరుకు తరలింపు
రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్  ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన బీహార్ లోని పాట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ ఐజీగా డిప్యూటేషన్ పై బాధ్యతలు నిర్వహించారు. 

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు పలు మార్లు ఆయనకు నోటీసులు జారీ చేసినా విచారణకు హజరుకాకపోవడంతో పాట్నా వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన ఏపీ పోలీసులు పాట్నా కోర్టులో హజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఈ రాత్రికి గుంటూరు తీసుకురానున్నారు.  


More Telugu News