ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ సింగిల్ కు యూట్యూబ్ లో విశేష స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ సింగిల్ కు యూట్యూబ్ లో విశేష స్పందన

Pawan Kalyan Ustaad Bhagat Singh Second Single Gets Great Response
  • యూట్యూబ్ లో దూసుకెళ్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సెకండ్ సింగిల్
  • 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' అంటూ పవన్ మేనరిజంతో పాట
  • ఈ పాటను 8 గంటల్లోనే చంద్రబోస్ రాశారన్న హరీష్ శంకర్
  • మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పేరుతో విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో విశేష స్పందనతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా పవన్ అభిమానులను ఈ పాట ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 

దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ పవర్‌ఫుల్ సాహిత్యం అందించారు. ‘నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’ అనే హుక్ లైన్‌తో మొదలయ్యే ఈ పాట, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అభిమానుల మధ్య ఈ పాటను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, పవన్  గత రెండు దశాబ్దాలుగా మెడ పట్టుకోవడం ఒక మేనరిజంగా చేస్తున్నారన్నారు. దానికి మాట రూపం ఇస్తే బాగుంటుందని 'నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే' అనే డైలాగ్ రాశానని చెప్పారు. దాన్నే హుక్ లైన్‌గా తీసుకుని చంద్రబోస్ కేవలం 8 గంటల్లో అద్భుతమైన పాట రాశారని తెలిపారు. ఇది పవన్‌పై అవగాహనతో రాసిన పాట అని, దేవిశ్రీ పాటాభిషేకం చేస్తే, చంద్రబోస్ సిరాభిషేకం చేశారని ప్రశంసించారు. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Advertisement
Pawan Kalyan
Ustaad Bhagat Singh
Harish Shankar
Aara of Ustaad
DSP
Devi Sri Prasad
Chandrabose
Sreeleela
Mythri Movie Makers
Telugu Movie

More Telugu News