గర్భవతిగానే సినిమా చేశా: లావణ్య త్రిపాఠి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గర్భవతిగానే సినిమా చేశా: లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi Reveals Filming During Pregnancy
  • మార్చి 6న విడుదలవుతున్న 'సతీ లీలావతి'
  • ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన లావణ్య త్రిపాఠి
  • సినిమా మొదలైన తర్వాత తనకు ప్రెగ్నెన్సీ అని తెలిసిందని వెల్లడి

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్టివ్‌గా కొనసాగుతోంది. ఇటీవలే ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘సతీ లీలావతి’ మార్చి 6న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య తన ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంది.


“ఈ సినిమా పనులు మొదలైన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది. సినిమాకు ‘నో’ చెబితే నిర్మాతలకు నష్టం అవుతుందని భావించాను. అందుకే గర్భవతిగానే షూటింగ్ చేశాను. వాంతులు అయ్యాక కూడా సెట్‌కి వెళ్లేదాన్ని. మైగ్రేన్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకుని షూట్ చేసేదాన్ని” అని లావణ్య వెల్లడించింది.


యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎంతో భయం వేసేదని, ప్రతి షెడ్యూల్ ముగిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకునేదాన్నని చెప్పింది. మూడు నెలల్లోపే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారని తెలిపింది. డ్యాన్స్ సీక్వెన్స్ సమయంలో కూడా భయం వేసిందని, కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ తన పరిస్థితిని అర్థం చేసుకుని స్టెప్స్ సర్దుబాటు చేశారని చెప్పింది. బేబీ బంప్ కనిపించకుండా కాస్ట్యూమ్స్ లూజ్‌గా డిజైన్ చేయించారని వెల్లడించింది. నాలుగో నెలలో కొన్ని సన్నివేశాలు ప్యాచ్‌వర్క్ చేయాల్సి వచ్చిందని తెలిపింది.


ఇంట్లోవాళ్లు మొదట భయపడినా, చివరికి పూర్తి సపోర్ట్ ఇచ్చారని, ముఖ్యంగా భర్త వరుణ్ చాలా అండగా నిలిచారని లావణ్య చెప్పింది. డాక్టర్లు ఎక్కువ ప్రయాణాలు చేయొద్దని చెప్పారని... అయితే, షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగేది కాబట్టి పొద్దున్నే లేచి వెళ్లడం కష్టంగా అనిపించేదని తెలిపారు. “ప్రెగ్నెన్సీ విషయం షూటింగ్ టీమ్‌కు మొదట్లో తెలియదు. తెలిస్తే ప్రత్యేకంగా చూస్తారేమోనని భయంతో చెప్పలేదు” అని ఆమె వెల్లడించింది.

Advertisement
Lavanya Tripathi
Sati Leelavathi
Varun Tej
pregnancy
Telugu cinema
movie promotion
actress interview
baby birth
Ramoji Film City
Brinda Master

More Telugu News