Ambati Rambabu: ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది.. ఈ రాంబాబుకు కూడా వస్తుంది: అంబటి రాంబాబు

Ambati Rambabu Comments on Government After Jail Release
  • ఆవేశంలో అన్న మాటలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశానన్న అంబటి
  • ఎన్ని కేసులు పెట్టినా, చావనైనా చస్తాను కానీ తగ్గనని స్పష్టీకరణ
  • తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్‌తో భేటీ అయ్యానని వెల్లడి
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి కుక్కకూ ఒక రోజొస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది. అప్పుడు తగ్గనే తగ్గను’ అని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం నిన్న గుంటూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

మీడియా సమావేశానికి ముందు, ఆయన తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అక్రమ కేసులు బనాయించారని జగన్‌కు వివరించారు. దీనిపై స్పందించిన జగన్, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయపోరాటం చేద్దామని భరోసా ఇచ్చారు. 

మీడియాతో మాట్లాడుతూ, తాను ఆవేశంలో అన్న మాటలపై రియలైజ్ అయ్యానని తెలిపారు. జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ‘ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. చావనైనా చస్తాను గానీ, తగ్గే ప్రసక్తే లేదు’ అని పేర్కొన్నారు. 
Ambati Rambabu
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Guntur
Rajahmundry Central Jail
Political Arrest
Bail
Political Vendetta

More Telugu News