Eesha Movie: ఓటీటీకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ .. 'ఈషా'

Eesha Movie Update
  • డిసెంబర్ 12న విడుదలైన 'ఈషా'
  • నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ 
  • థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్
  • రీసెంటుగా ఓటీటీకి వచ్చిన సినిమా 

హారర్ థ్రిల్లర్ సినిమాలు అనగానే, దాదాపు తక్కువ బడ్జెట్ లో కానిచ్చేస్తారనే అనే ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంటుంది. కంటెంట్ పై పెద్దగా దృష్టి పెట్టారని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ మధ్య వచ్చిన 'మసూద' .. అలాంటి అభిప్రాయాన్ని మార్చేసిందని చెప్పాలి. అదే పద్ధతిని కొనసాగిస్తూ ఆడియన్స్ కి ఉత్కంఠను పెంచిన మరి హారర్ థ్రిల్లర్ సినిమాగా 'ఈషా' కనిపిస్తుంది. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించిన సినిమా ఇది. 

డిసెంబర్ 12వ తేదీన విడుదలైన ఈ సినిమాలో త్రిగుణ్ .. హెబ్బా పటేల్ .. అఖిల్ రాజ్ .. సిరి హనుమంతు ప్రధానమైన పాత్రలను పోషించారు. థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టిన ఈ సినిమా, రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఓ మాదిరి కంటెంట్ తో ఈ సినిమాను రూపొంది ఉండొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా భయపెట్టగలిగింది. 

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నలుగురు స్నేహితులు, దెయ్యాలు - ప్రేతాత్మలు లేవని బలంగా నమ్ముతూ ఉంటారు. దెయ్యాల పేరుతో  భయపెడుతున్న దొంగ స్వామీజీలను పట్టుకుని, తమ నమ్మకాన్ని వెలుగులోకి తెస్తూ ఉంటారు. అలా ఆదిదేవ్ అనే ఒక స్వామీజీని కూడా పట్టించాలనే ఉద్దేశంతో, ఆంధ్ర - ఒడిశా బోర్డర్ కి ఈ నలువురు ఫ్రెండ్స్  బయల్దేరతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది మిగిలిన కథ.

Eesha Movie
Eesha
Hebah Patel
Amazon Prime
Telugu Horror Thriller
Srinivas Manne
Masooda Movie
Telugu Movies OTT
Akhil Raj
Siri Hanumanth

More Telugu News